కొండాపురం: గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఆర్డీవో

50చూసినవారు
కొండాపురం: గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఆర్డీవో
కొండాపురం బాలికల గురుకుల పాఠశాలను జమ్మలమడుగు ఆర్డీవో ఆదిమూలం సాయిశ్రీ సోమవారం తనిఖీ చేశారు. విద్యార్థులు పాముకాటుకు గురైన ప్రదేశాన్ని, పరిసరాలను, వంటగదిని పరిశీలించారు. పాఠశాల ఆవరణంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాఠశాల సిబ్బందిని ఆర్డీవో సూచించారు. ఆర్డీఓ వెంట తహశీల్దార్ సి.గురప్ప, ఎంఈఓ ఓబులేసు, ఎంఈఓ-2 రామయ్య వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్