ముద్దనూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు

77చూసినవారు
ముద్దనూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు
ముద్దనూరు మండలానికి చెందిన సుధాకర్ మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం. కడప సబ్ జైలు నందు విధులు ముగించుకుని తిరిగి బైక్ పై వస్తుండగా ఎర్రగుంట్ల మండలం నిడిజివ్వి సమీపాన ప్రమాదవశాత్తు ఎద్దుల బండిని ఢీకొనడంతో గాయాలపాలయ్యాడు. స్థానికులు అబులెన్స్ కు సమాచారం అందించి దానిలో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్