దేశంలో వైఎస్ జగన్ కు ఉన్న చరిష్మా ఎవరికీ ఉండదని కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం కడప వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్ స్వయం కృషితో పార్టీ స్థాపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా జగన్ జిల్లాకు వచ్చారని, ఆయనను చూసేందుకు ప్రతి రోజూ తెల్లవారు జామున నుండే ఆయన నివాసం వద్దకు ప్రజలు తరలి వస్తున్నారన్నారు.