ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగేలా ఆర్థిక శాఖ అధికారులను కలుస్తామని, ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్తామని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం కడప నగరంలోని ఎమ్మెల్సీ నివాసంలో సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ కన్వీనర్ రఘునాథరెడ్డి, ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డిలు వినతి పత్రం అందజేశారు.