పెన్నా నదిలో 40 వేల క్యూసెక్కుల నీటి ఉధృతి

65చూసినవారు
పెన్నా నదిలో 40 వేల క్యూసెక్కుల నీటి ఉధృతి
మూడు రోజులుగా పెన్నా నది ఎగువ భాగంలో భారీ వర్షాలు కురవడంతో పాపాగ్ని నది ఉదృతంగా ప్రవహిస్తున్నది. కుందు నది నుంచి కూడా భారీగా వరద నీరు పెన్నా నదిలో వచ్చి చేరుతున్నది. చెన్నూరు వద్ద బుధవారం రాత్రి 40 వేల క్యూసెక్కులు వరద నీరు దిగవనున్న సోమశిల జలాశయంలోకి వెళ్తున్నది. పెన్నా నది దాని ఉపనదులైన పాపాగ్ని కుందు వక్కిలేరు నదుల నుంచి కాకుండా వంకల నుంచి పెద్ద ఎత్తున పెన్నా నదిలోకి నీరు చేరుతున్నది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్