పీలేరు మండలం కోటపల్లెలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న గిరిజన బాలికల గురుకుల పాఠశాలను గురువారం ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మౌలిక వసతులు కల్పన కొరకు నివేదికలు తయారుచేసి ఉన్నతాధికారులకు పంపించాలని ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ను ఆయన కోరారు. విద్యార్థులతో మౌలిక వసతులు, విద్యాభ్యాసం పై ఆరా తీశారు. విద్యార్థినిలకు ట్యాబులు అందజేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.