రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన శుక్రవారం సాయంత్రం పీలేరులో వెలుగు చూసిందని కదిరి రైల్వే ఎస్సై రహీం తెలిపారు. సుమారు 45 ఏళ్ళ వయసున్న గుర్తుతెలియని వ్యక్తి గుంతకల్లు వైపు వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగిందన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనస్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా అనంతరం పోస్టుమార్టంకోసం బాడీని మార్చురీకి తరలించామన్నారు.