ప్రొద్దుటూరు లో కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరవ రోజున మంగళవారం అమ్మవారు గజలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయంలో వేసిన సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 134 ఏళ్లుగా దసరా ఉత్సవాలను ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తూ వస్తోంది. గజ లక్ష్మీదేవిని ఐశ్వర్యానికి ప్రతీకగా కొలుస్తారు.