ప్రొద్దుటూరు: కందిపప్పు ఇవ్వని డీలర్లపై చర్యలు తీసుకోవాలి

67చూసినవారు
ప్రొద్దుటూరు: కందిపప్పు ఇవ్వని డీలర్లపై చర్యలు తీసుకోవాలి
ప్రొద్దుటూరులో కందిపప్పు ఇవ్వని రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వైస్ ఛైర్మన్లు బంగారు మునిరెడ్డి, ఆయిల్ మిల్ కాజా లు డిమాండ్ చేశారు. శనివారం 87, 88 రేషన్ డీలర్లపై వారు డిప్యూటీ తహశీల్దార్ సాయినాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నిత్యవసర సరుకైన కందిపప్పును ప్రజలకు అందకుండా డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రజలందరికీ కందిపప్పు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్