అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు మరువలేనివని మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం పులివెందులలోని మున్సిపల్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా. ఆయన మునిసిపల్ కమిషనర్ రాముడుతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను పణంగా పెట్టారన్నారు.