పులివెందుల: సరస్వతి అలంకారంలో అమ్మవారి దర్శనం

67చూసినవారు
పులివెందుల: సరస్వతి అలంకారంలో అమ్మవారి దర్శనం
పులివెందుల గ్రామ దేవత శ్రీ అంకాలమ్మ తల్లి దేవస్థానంలో దసరా ఉత్సవాలలో భాగంగా బుధవారం అంకాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు అలంకారాలు చేశారు. అనంతరం శ్రీ దుర్గా హోమాన్ని నిర్వహించారు. అర్చకులు వరదాచార్యులు నేతృత్వంలో అమ్మవారికి అలంకరీకరణ చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు. సాయంత్రం అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున ప్రజలు భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్