భారతదేశంలోని గొప్ప పారిశ్రామికవేత్తలలో ఒకరైన రతన్ టాటా మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి మరియు విచారం వ్యక్తం చేశారు. "ఒక దూరదృష్టి గల నాయకుడు, మానవతావాది మరియు భారతదేశ కార్పొరేట్ ప్రపంచంలో ఒక లెజెండరీ వ్యక్తి అయిన రతన్ టాటా జీవితం వినయం మరియు విజయంతో కూడిన అసాధారణ ప్రయాణం." అని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ 'ఎక్స్'లో పోస్ట్ చేసింది.