కడప జిల్లా పులివెందుల టౌన్ రోటరీ పురానికి చెందిన శ్రీలేఖ, ఆమె తల్లి సులోచన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గండి దేవాలయాన్ని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో రాయచోటి చక్రాయపేటలో బస్సులో హఠాత్తుగా శ్రీలేఖ బస్సు డోర్ దగ్గరకు వెళ్లి దూకేసింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా బస్సు నుంచి దూకి గాయాలపాలయ్యారు. కాగా కూతురి మానసిక పరిస్థితి బాగోలేక పోవడంతో ఇలా చేసినట్లు తల్లి పేర్కొన్నారు.