పులివెందులలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో సోమవారం శ్రీకృష్ణ గోదాదేవి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ధనుర్మాస పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చింతకుంట సుధాకర్ రెడ్డి, ఈవో కొట్టే వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.