ఓబులవారి పల్లి - కృష్ణపట్నం రైల్వే లైన్ లో పది సంవత్సరాల నుండి గూడ్స్ రైళ్ళు నడుస్తున్నాయి కానీ ప్యాసింజర్ రైళ్లు నడపక పోవడం విచారకరమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి నాయకులు మలిశెట్టి రాహుల్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని కాబట్టి ప్రజల ప్రయాణానికి చాలా సౌకర్యంగా ఉంటుందన్నారు. గాలేరు - నగరి ని త్వరగా పూర్తిచేసి రాజంపేట, కోడూరు నియోజకవర్గాల లోని చెరువులు నింపాలని ఆయన కోరారు.