
రెడ్డిపల్లె చెరువు కట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి
అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె చెరువు కట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భువనగిరిపల్లె వాసులు నరసింహా, సుజాత దంపతులు ఆదివారం రాత్రి అక్కడికక్కడే మృతి చెందారు. వారి కుమారుడికి తీవ్ర గాయాలవ్వగా మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.