
రైల్వేకోడూరు: మొలకల రమణయ్యకి శ్రద్ధాంజలి ఘటించిన బత్యాల
రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం నారాయణ నెల్లూరు గ్రామనివాసి టీడీపీ నేత మొలకల రమణయ్య దశదిన కర్మలో పాల్గొని వారి చిత్రపటానికి పూలు సమర్పించి బుధవారంశ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించి మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ, బత్యాల చంగల్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.