భారీ వర్షం లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎంఎల్ఏ

58చూసినవారు
భారీ వర్షం లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎంఎల్ఏ
భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా అభివృద్ధి కార్యక్రమంలో సీసీ రోడ్డు నిర్మాణానికి రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, టిడిపి బాధ్యులు రూపానందరెడ్డి భూమి పూజ నిర్వహించారు. పుల్లంపేట మండలం అప్పారాజు పేట, రామక్క పల్లి గ్రామాలలో 26 లక్షలతో 520 మీటర్లు, 9 లక్షల వ్యయంతో 200 మీటర్లు, చిట్వేలు మండలం తిమ్మయ్యగారి పల్లి పంచాయతీలో 30 లక్షల వ్యయంతో 600 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.

సంబంధిత పోస్ట్