కోడూరులో వరద ఉద్ధృతి పరిశీలించిన ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్

70చూసినవారు
కోడూరులో వరద ఉద్ధృతి పరిశీలించిన ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్
రైల్వే కోడూరులో ప్రవహిస్తున్న గుంజున ఏరు ఉధృతిని రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్, రాజంపేట సబ్ కలెక్టర్ వైకుం నదియా దేవి పరిశీలించారు. బుధవారం రెడ్డివారి పల్లె వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఏరు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్