సుండుపల్లి మండలంలోని సానిపాయి ఫారెస్ట్ రేంజర్ గా చంద్రశేఖర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సానిపాయి రేంజర్ గా పనిచేసిన పీరయ్య నెల రోజుల క్రితం రిటైర్డ్ అయ్యారు. బుధవారం చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో ఫారెస్ట్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన తెలిపారు. అటవీ రక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు.