ఒంటిమిట్ట మండల పరిధిలోని రామచంద్రపురం ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని బుధవారం ఎంఈఓ డి ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు అందిస్తున్నారో లేదో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం రుచి చూసి మరింత నాణ్యతగా విద్యార్థులకు అందించాలని వంట ఏజెన్సీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.