ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేస్తున్న స్టూడెంట్ కిట్టులో భాగంగా సోమవారం ఒంటిమిట్ట మండలానికి షూ అందాయని ఒంటిమిట్ట ఎంఈఓ 2 డి.ప్రభాకర్ తెలిపారు. విద్యార్థులకు అందించాల్సిన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు, సమరూప దుస్తులు, డిక్షనరీలు, ముందుగానే అందాయని విద్యార్థులకు పంపిణీ చేశామన్నారు. దీంతో అన్ని మండలానికి చేరాయన్నారు. షూ కూడా విద్యార్థులకు గురువారం అందిస్తామన్నారు.