పెనగలూరు మండలం ఈటమార్పురం పంచాయతీలో కొండమీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆదివారం రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి బార్య వరలక్ష్మి స్వామి వారికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడి తీర్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు వరలక్ష్మికి సన్మానం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో వెంకటయ్య, కృష్ణయ్య, రవికుమార్, మహేంద్ర సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.