రామాపురం మండలం కురవపల్లికి చెందిన రెడ్డి నాయక్ కు ప్రమాదం జరిగి బెడ్ రెస్ట్ తీసుకుంటున్న సమయంలో సోమవారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎం ఎన్ ఆర్ ఎం ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. రెడ్డి నాయక్ కుటుంబ సభ్యులు మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు.