ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించిన సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ హాలు నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జేసి ఆదర్శ్ రాజేంద్రన్, డిఆర్వో కె. మధుసూదన్ రావు, ఎస్ డి సి రామసుబ్బయ్య ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.