AP: అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని రాజయ్యపేట వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ జాయింట్ వెంచర్ కంపెనీ ఆసక్తి చూపుతోంది. పరిశ్రమ మొదటి దశ నిర్మాణాన్ని 2029 జనవరికి పూర్తి చేసి ఉత్పత్తిలోకి తీసుకువస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సంస్థ ప్రతినిధులు, అధికారుల మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినట్లు సమాచారం.