రేపటి నుంచి మరో ఉచిత గ్యాస్ సిలిండర్: నాదెండ్ల

65చూసినవారు
రేపటి నుంచి మరో ఉచిత గ్యాస్ సిలిండర్: నాదెండ్ల
AP: మంత్రి నాదెండ్ల మనోహర్ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ' దీపం-2' అమలుపై కీలక ప్రకటన చేశారు. దీపం-2 పథకం లబ్ధిదారులకు ఏప్రిల్ 1 నుంచి జులై 31 మధ్య రెండవ ఉచిత సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. విశాఖలో మాట్లాడుతూ.. దీపం-2 పథకం కింద ఇప్పటి వరకు 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని ఆయన తెలిపారు. ఈ పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు లభిస్తాయి.

సంబంధిత పోస్ట్