AP: కరువు ప్రభావిత మండలాలకు సంబంధించిన జాబితాను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 51 కరువు ప్రభావిత మండలాలను గుర్తించినట్లు అందులో పేర్కొన్నారు. వర్షపాతం లోటు, పంటల నష్టం, భూగర్భ జలాల స్థాయి వ్యవసాయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఈ జాబితను తయారు చేసినట్లు చెప్పారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం, వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని 51 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు.