AP: కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తున్నామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. 'విద్యారంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్ మార్పులు చేస్తున్నాం. డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయబోతున్నాం' అని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రులు సత్యప్రసాద్, సత్యకుమార్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.