పిల్లల భవిష్యత్ కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం బాగా పనికొస్తుంది. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలతో పాటు సెక్షన్ 80సీసీడీ(1బి) కింద అదనంగా ఎన్పీఎస్ కింద చేసే చెల్లింపులకు రూ.50వేలు మినహాయింపు పొందొచ్చు. ఇదే మినహాయింపు వాత్సల్యకు కూడా వర్తిస్తుంది. అంటే చిన్నారుల పేరు మీద చెల్లింపులు చేస్తే పాత పన్ను విధానంలో గరిష్ఠంగా రూ.50వేల వరకు మినహాయింపు పొందొచ్చు.