AP: కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆక్వా, నాన్ ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న రొయ్యలు, చేపల చెరువులకు రూ.1.50కే యూనిట్ కరెంటు సరఫరా చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలమంది సాగుదారులకు లబ్ధి కలగనుంది. ఈ నిర్ణయంతో రూ.లక్షల బిల్లుల భారం తగ్గనుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.