వైఎస్ విజయమ్మ మరో లేఖ

75చూసినవారు
వైఎస్ విజయమ్మ మరో లేఖ
వైఎస్ విజయమ్మ మరో లేఖ రాశారు. 'గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. గతంలో ఎప్పుడో జరిగిన నా కారు ప్రమాదాన్ని.. నా కుమారుడిపై పెట్టి దుష్ప్రచారం చెయ్యడం అత్యంత జుగుప్సాకరం. అమెరికాలో ఉన్న నా మనవడి దగ్గరికి వెళ్తే దాన్ని కూడా తప్పుగా చిత్రికరించి.. భయపడి నేను విదేశాలకు వెళ్లిపోయినట్లు రాస్తున్నారు. ఇకపై ఇటువంటి లేనిపోని అసత్యలను ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోదలచుకోలేదు' అంటూ విజయమ్మ మరో లేఖ రాశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్