పల్నాడులో మరో ఘోరం

2277చూసినవారు
పల్నాడులో మరో ఘోరం
పల్నాడు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. మొన్నటికి మొన్న జిల్లాలోని వినుకొండలో నడిరోడ్డుపై రషీద్‌ను జిలానీ అత్యంత ఘోరంగా నరికి చంపాడు. దీనిపై చెలరేగిన దుమారం ఇంకా తగ్గట్లేదు. అదే సమయంలో అదే జిల్లాలో మరో దిగ్భ్రాంతికర ఘటన సంభవించింది. జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారు కొందరు సీనియర్ విద్యార్థులు. తమ హాస్టల్ గదులకు పిలిపించి.. కర్రలో చావబాదారు. దీనికి ఎన్‌సీసీ ట్రైనింగ్ అని పేరు పెట్టారు. ఈ ఘోరానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్