ఏపీలో విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో స్కూళ్ల పునఃప్రారంభం రోజునే 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను అందించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు పోటీ పరీక్షల మెటీరియల్, ప్రాక్టికల్ రికార్డులు అందజేయనున్నారు.