ఏపీ కేబినెట్ రేపు (శుక్రవారం) సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటి కానుంది. ఈ సందర్భంగా తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పలు కంపెనీలకు భూములు కేటాయింపునకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం.