పసుపు పంట వేసే ముందు వేసవిలో లోతుగా దున్నుకోవాలి. ఇలా దున్నుకోవడం వల్ల కలుపు విత్తనం చాల వరకు నాశనం అవుతాయి. విత్తనం నాటిన మరుసటి రోజు అట్రజిన్ ౩ గ్రా./ 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. విత్తనం వేసిన 16-18 రోజుల తరువాత మొలకెత్తుతాయి కావున విత్తిన 7-8 రోజులలోపు పండ్లగోర్రుతో పైపాటుగా తిప్పాలి.