ఏపీలో జనసేన, టీడీపీ అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు తమ తమ పార్టీ ఎంపీలతో నేడు సమావేశమయ్యారు. ఈ నెల 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరు ఎంపీలతో సమావేశమ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రాభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. ఈ క్రమంలో ఎంపీలకు వారు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ సమావేశాలను ఒక వేదికగా వాడుకొని ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటామని ఎపీలు ఆశాభావం వ్యక్తం చేశారు.