ఏపీలో వరుసగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల పరపర కొనసాగుతుంది. దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తన బలాన్ని వాడుకొని పార్లమెంట్‌లో ఇష్యూని లేవనెత్తాలని చూస్తున్నారట. అయితే కేంద్రంలోనూ టీడీపీ ప్రాతినిథ్యం ఉండటంతో జగన్ నిర్ణయం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.