ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రమే తిరుమల చేరుకున్న ఆమె సోమవారం ఉదయమే వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడంతో తిరుమలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.