అమరావతిలో మరో 30 వేల ఎకరాల భూ సేకరణకు రంగం సిద్ధం

60చూసినవారు
అమరావతిలో మరో 30 వేల ఎకరాల భూ సేకరణకు రంగం సిద్ధం
AP: రాజధాని అమరావతి పునర్ నిర్మాణానికి కూటమి సర్కార్ సన్నద్దమవుతోంది. ప్రస్తుతం 29 గ్రామాల్లోని 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి రాజధాని కోసం.. ప్రభుత్వం ల్యాండింగ్ పూలింగ్ ద్వారా సేకరించింది. అయితే రాజధాని అమరావతి భవిష్యత్తు అవసరాలను దృష్టి పెట్టుకొని మరో 30 వేల ఎకరాలకు పైగా భూమి సమీకరణకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి కోసం మరో 44 వేల ఎకరాల భూమి సమీకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్