ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ బాధితులను తొలిదశలోనే గుర్తించి, చికిత్స అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్ గుర్తించేందుకు.. క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఏపీ వైద్యారోగ్య శాఖ అధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగుతోంది. ఉచిత క్యాన్సర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1500 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.