ఏపీలో మరో ప్రతిష్టాత్మక ఇన్నొవేషన్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఫిజిక్స్ వాలాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఉన్నత విద్య ఆధునికీకరణ కోసం టీబీఐతో మరో ఒప్పందం కుదిరింది. సచివాలయంలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ రెండు ఒప్పందాలు జరిగాయి. యువతకు ప్రపంచస్థాయి అవకాశాలే ప్రధాన లక్ష్యంగా ఈ ఒప్పందాలు జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది.