ఏపీ సీఎం చంద్రబాబు రైతులకు శుభవార్త చెప్పారు. ప్రభుత్వ కేంద్రాలకు ధాన్యం విక్రయించే రైతులకు రోజుకారోజే, వీలైతే రెండు గంటల్లోనే ధాన్యం డబ్బులు అకౌంట్లో జమ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. 93 శాతం రైతులకు 24 గంటల్లోగా డబ్బు చెల్లిస్తున్నట్లు చెప్పారు. దిగుబడి పెరిగి డబ్బు సకాలంలో అందడంతో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. దళారీల ముసుగులో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని సీఎం హెచ్చరించారు.