AP: రెండు రోజులు భారీ వ‌ర్షాలు

78చూసినవారు
AP: రెండు రోజులు భారీ వ‌ర్షాలు
కోస్తాంధ్రలో అక్కడక్కడ గురువారం, శుక్ర‌వారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయ‌ని APSDMA వెల్ల‌డించింది. లోత‌ట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వాన‌లు కురుస్తాయ‌ని తెలిపింది. ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి, ఉమ్మ‌డి గుంటూరు, SKL, VZM, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, రాయ‌ల‌సీమ జిల్లాల్లో తేలికపాటి వాన‌లు ప‌డ‌తాయ‌ని పేర్కొంది.

సంబంధిత పోస్ట్