ఆడపిల్లల పెళ్లిపై ఆంధ్రప్రదేశ్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రుల కుటుంబంలో కుమార్తె స్థానాన్ని పెళ్లి అంతం చేయదనివ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాలకు సంబంధించిన ఓ కేసు విచారణలో ఈ కామెంట్స్ చేసింది. పెళ్లి అయిన కూతురిని తన పేరెంట్స్ కుటుంబంలో సభ్యురాలు కాదనడాన్ని తప్పు బట్టింది. కారుణ్య నియమాకాల్లో కుమారులను, కుమార్తెలను వేర్వేరుగా పరిగణించడం సరికాదని పేర్కొంది. ఆడపిల్లలు పెళ్లి అయినా.. కాకున్నా జీవితాంతం పేరెంట్స్ కుటుంబంలో భాగమేనని స్పష్టం చేసింది.