ఏపీలో డీఎస్పీల ప్రమోషన్ల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రమోషన్లపై ఇచ్చిన ఆదేశాలు రీ రివ్యూ చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 1995 బ్యాచ్ సీఐలకు ప్రమోషన్ ఇవ్వకుండా 1996 బ్యాచ్‌కి గత ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చింది. గత ప్రభుత్వ ఆదేశాలపై 1995 బ్యాచ్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రమోషన్లను రీ రివ్యూ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.