AP: కడప జిల్లా పులివెందుల పోలీస్ స్టేషన్లో హత్య మూవీపై ఫిర్యాదు నమోదైంది. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ చిత్రయూనిట్‌పై పులివెందుల అర్బన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. హత్య సినిమాలో తన పాత్ర, తన తల్లి పాత్రపై అభ్యంతరాలు ఉన్నాయని, సినిమాను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశాడు. సినిమాలో తమ పాత్రలు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.