‘ఏపీ జనాభా తగ్గిపోతోంది’

68చూసినవారు
‘ఏపీ జనాభా తగ్గిపోతోంది’
ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఏపీ జనాభా రోజురోజుకూ తగ్గిపోతోందన్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు మంచిది కాదన్నారు. ఏపీలో జనాభా జాతీయ సగటు కంటే తక్కువ నమోదవుతోందని, యువత సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత జనాభా రాష్ట్రానికి ఎంతో అవసరమని, రాబోయే కాలంలో వృద్ధ జనాభా పెరిగే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్