AP: వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. 13 కేసులకు సంబంధించి ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు న్యాయస్థానం విచారించింది. తదుపరి విచారణ జనవరి 3కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.