ఏపీలో స్కూల్ ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు ఉర్దూ స్కూల్లో నేడు ప్రహరీ గోడ కూలి ఒకటో తరగతి చదువుతున్న మోహిన్ మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గోడ శిథిలాలను తొలగించి విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.